Saturday, November 16, 2024

TG | జన్వాడ ఫాంహౌస్ అక్ర‌మ‌ కట్టడం… తేల్చేసిన‌ అధికారులు

జన్వాడ ఫామ్‌హౌస్‌ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కేటీఆర్‌కు, ఆయన బావమరిది రాజ్‌పాకాలకు అధికారులు భారీ షాకిచ్చారు. ఫామ్‌ హౌస్‌లో అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడంపై ఇప్పటికే ఒకపక్క దర్యాప్తు కొనసాగుతుండగా.. ఇప్పుడు ఏకంగా ఆ ఫామ్‌ హౌస్‌ పూర్తిగా అక్రమ కట్టడమని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు గుర్తించడంతో రాజ్ పాకాలతోపాటు కేటీఆర్ కూడా చిక్కుల్లో ప‌డ్డ‌ట్టైంది.

కాగా.. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే ఈ వివరాలన్నీ సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో బయటపడ్డాయి. ఇక బిల్డింగ్‌ నిర్మిస్తున్నప్పుడే అక్రమ కట్టడమని పేర్కొంటూ నోటీసులు ఇచ్చామని పంచాయతీ కార్యదర్శి చెబుతున్నారు. 2022 జులై 6న మొదటిసారి, అనంతరం జనవరి 2023 30న రెండోసారి, 2023 ఫిబ్రవరి 8న మరోసారి నోటీసులు ఇచ్చామని తెలిపారు. వాటిలో ఒక్క నోటీసుకు కూడా పాకాల రాజు స్పందించలేదని ఉన్నతాధికారులకు నివేదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement