Friday, November 22, 2024

Janasena with BJP – అమిత్ షా తో పవన్ కల్యాణ్ భేటి – సీట్ల సర్దుబాటుపై చర్చ

న్యూ ఢిల్లీ – బిజెపి నేత, కేంద్ర మంత్రి అమిత్ షా తో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సైతం పాల్గొన్నారు. ఇప్పటికే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్.. పవన్‌ కల్యాణ్‌ను కలిసి తెలంగాణలో బిజెపికి మద్దతివ్వాలని కోరారు. ఇక ఇప్పుడు అమిత్ షా తో పవన్ భేటీ అయ్యారు. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ముగ్గురు నేతలు చర్చించారు.

భేటీ అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘ స్పష్టత ఇస్తాం. జనసేన.. ఎన్డీయే భాగస్వామి.. ప్రస్తుతం తెలంగాణ వ్యవహారాలపై చర్చించాం. ఏపీకి సంబంధించి అక్కడి పార్టీ.. లేదా కేంద్ర పార్టీ చూస్తుంది. నవంబర్ 1న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత బీజేపీ తదుపరి జాబితా విడుదల చేస్తాం’ అని తెలిపారు. కాగా ఈనెల 22న రాష్ట్రంలో బీజేపీ 52 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా తదుపరి సీట్లలో కొన్నింటిని జనసేనకు ఇచ్చే ఛాన్స్ ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement