హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో బలం పెంచుకునేందుకు జనసేన పార్టీ పావులు కదుపుతోంది. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో పార్టీ క్రియాశీల కార్యకర్తలను తయారు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి డివిజన్‌లో కనీసం 100 మంది క్రియాశీల కార్యకర్తలను తయారు చేసి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని నేతలకు ఆపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్, తెలంగాణ ఇన్‌చార్జి వేమూరి శంకర్‌గౌడ్ తెలిపారు.
క్రియాశీల సభ్యులు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యకర్తలకు కష్టకాలంలో అండగా ఉండేందుకు అధినేత బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారని చెప్పారు. ఏపీలో ప్రమాదాలకు గురై-న 38 మంది నిరుపేద కార్యకర్తల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ బీమాను పంపిణీ చేశారని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించాలని, ఇందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రియాశీల సభ్యత్వాలను నమోదు చేయాలన్నారు