Friday, November 15, 2024

అవ‌స‌రం అయితే బిఆర్ఎస్ తో పొత్తు – కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి…

హైద‌రాబాద్ – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేసిన నేప‌థ్యంలో విప‌క్షాలు ఏక‌మ‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మయ్యాయి.. కొన్ని రాష్ర్టాల‌లో కాంగ్రెస్ పార్టీతో అక్క‌డ ఉండే రీజిన‌ల్ పార్టీల‌తో విబేదాలు ఉన్న‌ప్ప‌టికీ ఢిల్లీ మాత్రం రాహుల్ కు మ‌ద్ద‌త్తుగా జ‌రుగుతున్న‌నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌లో ఆయా ప్రాంతీయ పార్టీలు పాల్గొంటున్నాయి.. బిజెపి చ‌ర్య‌ల‌ను అడ్డుకోన‌ట్ల‌యితే ప్రాంతీయ పార్టీలు క‌నుమ‌రుగ‌య్యేలా క‌మ‌ల‌ల‌నాధులు ముందుకు క‌దులుతార‌నే భ‌యాలు కొన్నివిప‌క్ష పార్టీల‌లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. దీంతో విబేదాలు మ‌రిచి క‌ల‌సిక‌ట్టుగా బిజెపి తో పోరాటానికి సిద్ద‌మ‌వుతున్నాయి. ఈ త‌రుణంలోనే తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ ,బిఆర్ఎస్ పొత్తుపై స్పందించారు..ఎన్నికల తర్వాత పొత్తు తప్పదనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల పొత్తులపై మరో 3 రోజుల్లో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని జానారెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పొత్తులుంటామయని, అవసరమైతే శివసేనతోనూ జత కలుస్తామని జానారెడ్డి తెలిపారు. కాగా, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తుపై టీ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బీఆర్ఎస్‌తో పొత్తుకు సై అంటుండగా రేవంత్ వర్గం మాత్రం ఆ వార్తలను ఖండిస్తోంది. బీఆర్ఎస్‌తో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదంటూ గతంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ క్లారిటీ ఇవ్వగా.. బీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా చెబుతున్నారు. ఇటీవ‌లే కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా బిఆర్ఎస్ తో పొత్తు ఉండోచ్చంటూ వ్యాఖ్యానించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement