Saturday, November 23, 2024

Jana Jatara ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం మోదీతో కెసిఆర్ కుమ్మక్కు – రేవంత్ రెడ్డి

నారాయణపేట – ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు సిఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను ఓడించేందుకు మోదీ నుంచి కేసీఆర్ సుపారీ తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ పేట జిల్లాలో కాంగ్రెస్ జనజాతర పేరిట సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ,

‘జైలులో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, బీఆర్ఎస్ ను మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారు. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని కేసీఆర్ చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రచారమే చేయట్లేదు’ అని వ్యాఖ్యానించారు.మల్కాజిగిరి, భువనగిరి, మహబూబ్ నగర్, చేవేళ్ల, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ ప్రచారం చేయడం లేదని ఆరోపించారు. ఈ ఐదు స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ప్రతి పేదవాని ఇంటికి కరెంట్ ఉండాలనే ఉద్దేశంతోనే ఉచిత కరెంట్ ఇచ్చామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రతి గ్రామాన ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇచ్చి ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కేసీఆర్ ఊరించి..ఊరించి ఊరవుతల ఇండ్లు కట్టి ఒక్కరికి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అంటున్నారని ఎందుకు ఓడించాలో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. పదేండ్లలో కేసీఆర్ విద్వాంసాలు సృష్టించారని అన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఇదేమైన రాచరికపు వ్యవస్థనా అని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డలు ముఖ్యమంత్రులు కావద్దా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు..

దొరలకు, పెత్తందారులకు కాకుండా బీసీలు, సామాన్యులకు కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇచ్చిందని రేవంత్ చెప్పారు. ‘రాష్ట్రంలో 10% జనాభా ఉన్న ముదిరాజ్లకు కేసిఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముదిరాజ్లను బీసీ-D నుంచి బీసీ-A గ్రూప్లోకి మార్చేందుకు ప్రయత్నిస్తాం అని హామీ ఇచ్చారు. మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడుతాం. 15 ఎంపీ సీట్లను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తా’ అని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement