కొరడా ఝులిపిస్తున్న న్యాయమూర్తి
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మందుబాబులపై కొరడా ఝులిపిస్తున్నారు. ప్రతినిత్యం పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ అనలైజర్ల ద్వారా తనిఖీలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మందుబాబులను అదుపులోకి తీసుకుంటున్నారు. న్యాయమూర్తి మంజుల ఎదుట హాజరు పరుస్తుండగా జరిమానాలతో పాటు జైలు శిక్ష, సామాజిక సేవలో భాగంగా క్లీనింగ్ పనులు ట్రాఫిక్ నిధులు శిక్షగా విధిస్తున్నారు. తాజాగా గురువారం 14 మంది మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 11,400 రూపాయల జరిమానా విధించడంతోపాటు ముగ్గురికి జైలు శిక్ష ఖరారు చేశారు.
సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన ఈరెళ్లి సతీష్ కు 3 రోజులు, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన మొగుళ్ల సంతోష్ కు 2 రోజులు, పెద్దపల్లి పట్టణం ఉదయ్ నగర్ కు చెందిన ఎలుకపల్లి సతీష్ కు 2 రోజుల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రతినిత్యం తనిఖీలు నిర్వహిస్తామని మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ అనిల్ కుమార్ హెచ్చరించారు.