Wednesday, November 6, 2024

Jagityala – కాంగ్రెస్ నేత దారుణ హత్య ..

రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు

జగిత్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దారుణ హత్య జగిత్యాల జిల్లాలో సంచలనం రేపింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కుడి భుజం లాంటి జాప్తాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారు గంగారెడ్డి మంగళవారం ఉదయం పక్కా ప్రణాళిక ప్రకారం హత్యకు గురి కావడం పట్టణం ఒకసారి ఉలిక్కిపడేలా చేసింది.

ముందుగా నిందితులో వేరే కార్ లో వచ్చి మృతున్ని కార్ తో గుద్ది ఆపై విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి హతమార్చి వేరే కారులో పరారయ్యారు.

పోలీసుల వైఫల్యం వలన గంగారెడ్డి హత్య జరిగిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాత బస్టాండ్ చౌరస్తా వద్ద గ్రామస్తులతో కలిసి నిరసనకు దిగారు.

- Advertisement -

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజకీయ కక్షలతో జరిగిన హత్యగా ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నాయకుడి హత్య జరగడం వెనుక ప్రతిపక్ష పార్టీ రాజ్యం అధికార పార్టీలో నడుస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడుతున్నారు.

నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేకపోతే ఇక పార్టీని కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకుంటామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement