బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ఆదివారం చూశారు. బెంగళూరులోని గరుడ మాల్ లో వేసిన స్పెషల్ షోకు కర్ణాటక శాఖ బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజే, రాజీవ్ చంద్రశేఖర్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై, బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్యతో కలిసి నడ్డా ఈ చిత్రాన్ని వీక్షించారు.ఈ సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ‘కళ్లు తెరిపిస్తుంది’ అని అన్నారు.
మందుగుండు సామగ్రి అవసరం లేని కొత్త రకం టెర్రరిజం ఉందని, విషపూరిత ఉగ్రవాదాన్ని ఈ సినిమా బహిర్గతం చేస్తుందని తెలిపారు. ఈ తరహా ఉగ్రవాదానికి ఏ రాష్ట్రానికో, మతానికో సంబంధం లేదన్నారు. ఈ సినిమా చూశాక మన సమాజాన్ని శూన్యం చేయడానికి ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో ప్రజలకు అర్థమవుతుందని జేపీ నడ్డా అన్నారు. ఈ విషయం మనం తెలుసుకోవాలని సూచించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రచారం నిర్వహించడానికి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ సినిమా చూశారు.
The Kerala Story is a film but it tells a lot about the new kind of terrorism where the youth is pushed towards terrorism.
— BJP (@BJP4India) May 7, 2023
It has nothing to do with a particular state or religion. It is a global story and must be watched.
– Shri @JPNadda pic.twitter.com/FpOAUkq8bi