Tuesday, November 26, 2024

IVF Center – ఇక గాంధీ హాస్ప‌ట‌ల్లోనే సంతాన సాఫల్య కేంద్రం – లాంచ‌నంగా ప్రారంభించిన హోం మంత్రి

హైద‌రాబాద్ – సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్‌-విట్రో-ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) సెంటర్‌ను తెలంగాణ సర్కార్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలోని మాతా,శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రాన్ని నేడు హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌ ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పేట్లబూర్జు, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రుల్లో కూడా ఐవీఎఫ్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వీటి ద్వారా ఖరీదైన ట్రీట్మెంట్‌ను ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు.

కాగా, రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2018 నుంచి గాంధీ దవాఖానలో ఐయూఐ విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని, మందులు వాడటంతో ఇప్పటివరకు 200 మహిళలకు సంతానం కలిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు చెప్పారు. ఇప్పుడు మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఐవీఎఫ్‌ విధానాన్ని అందుబాటులోకి తేవడం శుభపరిణామమని సంతాన సాఫల్య కేంద్రం నోడల్‌ అధికారి, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్‌ వెల్లంకి జానకీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement