Tuesday, November 26, 2024

Big Breaking | కేసీఆర్​ గద్దె దింపాల్సిన సమయం వచ్చింది.. రాబోయేది బీజేపీ సర్కారే: అమిత్​షా

ఖమ్మంలో రైతు గోస–బీజేపీ భరోసా బహిరంగ సభ జరిగింది. ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం జరిగిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్​షా ప్రసంగించారు. తెలంగాణలో డబులింజన్​ సర్కారు రావాల్సిన అవసరం ఉందని, సీఎం కేసీఆర్​ని సాగనంపాలని అన్నారు. అమిత్​షా హిందీ ప్రసాంగానికి పార్టీ సీనియర్​ నేత కే. లక్ష్మణ్​ తెలుగు అనువాదం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, బీఆర్​ఎస్​ పార్టీ, సీఎం కేసీఆర్​పై అమిత్​షా మండిపడ్డారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

బీజేపీకి ప్రజలు మద్దతు ఇవ్వాలి. హైదరాబాద్​ విముక్తికి  75 సంవత్సరాలు పూర్తయ్యాయి. కేసీఆర్​ సర్కార్​కు కౌంట్ డౌన్​ స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్​ 75 విముక్తి దినోత్సవం త్వరలోనే రాబోతోంది. ఓవైసీతో కలిసి కేసీఆర్​ తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని అవమానించారు. కేసీఆర్​ కారు స్టీరింగ్​ ఓవైసీ చేతిలో ఉంది. బీఆర్​ఎస్​ ప్రభుత్వం రజాకార్ల పక్కన కూర్చొని పరిపాలిస్తోంది. ఇక.. ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేసీఆర్​ గద్దె దిగిపోవాల్సిందే. సంపూర్ణ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుంది.

దక్షిణ అయోధ్యగా భద్రాచలం పేరుగాంచింది. భద్రాచలం రాముడికి ముత్యాల తలంబ్రాలు సమర్పించడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని కేసీఆర్​ విడిచిపెట్టారు. భద్రాచలం వస్తారు కానీ, రాముడిని దర్శించుకోరు. ఎందుకంటే ఆ కారు స్టీరింగ్​ మజ్లిస్​ చేతిలో ఉంది.  వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీని గెలిపిస్తారా? కేసీఆర్​ను మళ్లీ సీఎం చేస్తారా.? మజ్లిస్​ చేతిలో ఉన్న కేసీఆర్​ను మళ్లీ సీఎం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలపై దాడులు చేస్తే వాళ్లు ఆగిపోతారని అనుకుంటున్నారు. ఈటెల రాజేందర్​ను అసెంబ్లీ నుంచి బయటికి పంపించారు. ఎన్నో పథకాల పేరుతో ప్రజలను కేసీఆర్​ మోసం చేశారని ధ్వజమెత్తారు.

ఇక.. కాంగ్రెస్​ పార్టీ ఆనాడు రైతుల కోసం 22వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెడితే.. ఇవ్వాల ప్రధాని మోదీజి రైతుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం లక్షా 25వేల కోట్ల బడ్జెట్ పెట్టారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిని అరెస్టు చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement