Friday, November 22, 2024

ఇన్వెస్ట్‌ ఇండియాతో ఐటీసీ భాగస్వామ్యం

హైదరాబాద్: భారతదేశంలో సుప్రసిద్ధ పేపర్‌, పేపర్ బోర్డ్స్‌, స్పెషాలిటీ పేపర్‌ తయారీ సంస్ధ ఐటీసీ పేపర్‌ బోర్డ్స్‌ అండ్‌ స్పెషాలిటీ పేపర్స్‌ డివిజన్‌ (పీఎస్‌పీడీ) ఇప్పుడు ఇన్వెస్ట్‌ ఇండియాతో భాగస్వామ్యం చేసుకుని ఐటీసీ సస్టెయినబిలిటీ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. సస్టెయినబల్‌ ప్యాకేజింగ్‌ మరియు స్మార్ట్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పరిష్కారాలపై వినూత్నమైన స్టార్టప్‌ ఆలోచనలకు ఇది మద్దతునందిస్తుంది. స్టార్టప్‌ ఇండియా పోర్టల్‌ ద్వారా ఐటీసీ పీఎస్‌పీడీ ఇప్పుడు స్టార్టప్స్‌ నుంచి ఈ ఛాలెంజ్‌ల కోసం ప్రతిస్పందనలను ఆహ్వానిస్తోంది. ఈసంద‌ర్భంగా ఐటీసీ పీఎస్‌పీడీ సీఈవో వాదిరాజ్‌ కులకర్ణి మాట్లాడుతూ… పెద్దదైనా, చిన్నదైనా వ్యాపార సంస్థలు తమ అసాధారణ నిర్వహణ, వినూత్నమైన సామర్థ్యం, నిలకడైన ప్యాకేజింగ్‌, వ్యర్థ నిర్వహణ పరిష్కారాలతో సమాజంలోమార్పును తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఈ ఫిలాసఫీ నూతన ఐటీసీ సస్టెయినబిలిటీ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో ప్రదర్శితమవుతుందన్నారు. ఇన్వెస్ట్‌ ఇండియా ఎండీ అండ్‌ సీఈవో దీపక్‌ బగ్లా మాట్లాడుతూ… సర్కులర్‌ ఆర్ధిక వ్యవస్థ దిశగా భారతదేశం పయణించే రీతిలో మేడ్‌ ఇన్‌ ఇండియా పరిష్కారాలను ఇన్నోవేటివ్‌ స్టార్టప్స్‌ ప్రదర్శించగలవన్నారు. భారతదేశపు వృద్ధి కథలో భాగం కావాల్సిందిగా స్టార్టప్స్‌ను ఆహ్వానిస్తున్నామని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement