Friday, November 22, 2024

Siddipet: సిద్ధిపేటకు ఐటీ టవర్.. క‌ల నెర‌వేరింద‌న్న హ‌రీశ్ రావు

సిద్ధిపేట అర్బన్: సిద్ధిపేటకు ఐటీ టవర్ రావాలన్నది నా కల.. ఇవాళ ఆ కల నిజంగా కళ్లకు కనబడుతున్నది.. ఒక ప్రజాప్రతినిధి ప్రజల ఆకాంక్షలు అమలు చేస్తుంటే ఆ ప్రజాప్రతినిధికి మరింత శక్తి వస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శివారు ఐటీ టవరులో ఎమ్మెల్యే సతీశ్, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ లతో కలిసి సిద్ధిపేట హబ్ ఐటీ వెబ్ సైట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఐటీ టవర్ ద్వారా 1500మందికి ఉద్యోగ కల్పన కలగాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఫేజ్-1 పూర్తికాగానే ఫేజ్-2 ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఐటీ టవర్ లో టాస్క్ ద్వారా శిక్షణా తరగతులు బాగా జరుగుతున్నాయని వివరించారు.

సిద్ధిపేటలో సొంతంగా ఐటీ టవర్ పెట్టాలని అనుకునే వారికి కావాల్సిన మౌళిక సదుపాయాల కల్పనతో పాటు కావాల్సిన అనువైన స్థలాన్ని ఇస్తామని ఐటీ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు, ప్రెషర్స్ టాస్క్ లో చేరి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఇటీవల 7 కంపెనీలు నిర్వహించిన జాబ్ మేళాలో ఎంపికైన ఉద్యోగులకు జాబ్ ఆఫర్ లెటర్స్ అందించారు. అంతకు ముందు ఐటీ కంపెనీ నిర్వాహకులు మాట్లాడుతూ.. 18 కంపనీలకు ఎంపికైన ఉద్యోగులకు టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ నెలలోపు వెయ్యి మంది ఈ ఐటీ టవర్ లో ఉద్యోగులుగా ఉంటారని పేర్కొన్నారు. కాగా న్యూజెర్సీ బేస్డ్, బెంగళూరు, చెన్నయ్ బేస్డ్ ప్రముఖ కంపనీ ప్రతినిధులు ప్రభాకర్, స్వామినాథన్ లు సిద్ధిపేట యువతలో చాలా టాలెంట్ ఉన్నదని, తమ కంపనీల్లో మరికొంత మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement