స్వస్తిక్ రియల్ కంపెనీలో, యాజమాని నివాసంలో కూడా…
షాద్‌నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్ లో సోదాలు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో సోమవారం ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తున్నాయి. బంజారా హిల్స్, చేవెళ్ల , షాద్‌నగర్ ప్రాంతాల్లో ఏక కాలంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఐటీ దాడులు తరచూ జరుగుతున్న విషయం తెలిసింది. ఈ సారి స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కంపెనీలో దాడులు చేపట్టారు.
స్వస్తిక్ రియల్ ఎస్టేట్‌లో సోదాలు
స్వస్తిక్ రియల్టర్ కంపెనీ, యాజమాన్యం నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. స్వస్తిక్ కంపెనీకి చెందిన కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో ఏకకాలంలో ఐటీ దాడులు జరిగాయి. సోమవారం ఉదయం ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి సిటీలోని షాద్ నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రైడ్స్ చేశారు.