Friday, November 22, 2024

TS : మల్లారెడ్డి కాలేజీల్లో ఐటీ దాడులు

మ‌ల్లారెడ్డి కాలేజీల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల‌ను ఎక్కువ ఫీజుకు యాజ‌మాన్యం అమ్ముకుంటోంద‌నే ఆరోప‌ణ‌ల‌తో సోదాలు చేస్తున్నారు. ఏ విద్యార్థి ఎంత ఫీజు కట్టాడనే దానిపై ఫోకస్ పెట్టారు.

- Advertisement -

మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీలో 40 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాభాపేక్ష కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెక్కల్ని రికార్డుల్లో సక్రమంగా చూపించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎంతకు అమ్ముకున్నారనే దానిపై ఐటీ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఏ విద్యార్థి ఎంత ఫీజు కట్టాడనే దానిపై ఫోకస్ పెట్టారు. కాలేజీ రికార్డులను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు… వాటిని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇప్పటికే కాలేజీ మేనేజ్ మెంట్, సిబ్బందిని ఐటీ అధికారులు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement