హైదరాబాద్ లో మరోసారి అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో ఐటీ రైడ్స్ నిర్వహిస్తుంది.. బడంగ్ పేట్ మేయర్ కాంగ్రెస్ నాయకురాలు పారిజాతానర్సింహారెడ్డి, బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా సోదాలు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరం నుంచి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న విషయం తెలిసిందే. బాలాపూర్‌లోని పారిజాత నివాసంలో ఇవాళ ఉదయం 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఏకంగా ఆమెకు సంబంధించిన 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. బడంగ్‌పేట మేయర్‌గా పారిజాత ఉన్నారు. పారిజాత కూతురు ఫోన్‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి హైదరాబాద్‌లో లేరు. పారిజాతకు సంబంధించిన ఇళ్లు, కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు వేలంలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కేఎల్‌ఆర్ నివాసం ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కేఎస్‌ఆర్ కు సంబంధించిన కన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులుపెట్టిన కేఎల్ ఆర్. కేఎల్‌ఆర్ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు. దీంతో హైదరాబాద్ లోని రాజకీయ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వీరిద్దరితో పాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఐటీ దాడులు జరగడం ఇదే తొలిసారి. ఈ సమయంలో వాహనాల్లో తరలిస్తున్న డబ్బులను పట్టుకుని సీజ్ చేస్తున్నారు. అయితే ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ నాయకుల ఇళ్లలో తనిఖీలు జరగడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
.