హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాణ సంస్థల పై మూడో రోజు గురువారం ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు , మైత్రి మూవీ మేకర్స్ , నవీన్ ఎర్నేని , డైరెక్టర్ సుకుమార్ , మాంగో అధినేత రామ్ , సినీ ఫైనాన్సర్లకు చెందిన ఇళ్లు, ఆఫీసులలో సోదాలు కొనసాగుతున్నాయి.
- Advertisement -
సినీ ఇండస్ట్రీలోని దాదాపు 15 మంది వరకు వారి ఇండ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, స్థిర చర ఆస్తులను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా గురువారంతో సోదాలు ముగిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.