హైదరాబాద్, ఆంధ్రప్రభ : సివిల్స్‌కు సిద్ధపడే వారికి పెద్దగా ఇంటెలిజెన్సీ అవసరం లేదని, బాగా కష్టపడి చదివితే విజయం సాధించవచ్చని అదనపు డీజీపీ వై. నాగిరెడ్డి అన్నారు. సోమవారం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన వ్యవసాయ కళాశాల దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా నాగిరెడ్డి పాల్గొని మాట్లాడారు.. వ్యవసాయ కళాశాల ఇతర సంస్థలతో అనుసంధానం చేసుకోవడం మంచి పరిణామన్నారు.
ఇండస్ట్రీకి విశ్వవిద్యాలయం నమ్మకం కలిగిస్తే టైఅప్స్ బలంగా ఉంటాయన్నారు. మార్కెట్ ఓరియంటెడ్ పరిశోధనలు చాల అవసరమని ఆయన అన్నారు. ఉత్పత్తుల ఖర్చులు తగ్గించుకోవడానికి విశ్వవిద్యాలం కృషి చేయాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. వివిధ జనరేషన్స్ క్రమంలో ప్రస్తుతం ఉన్న తరం రాబోయే 20 ఏళ్ళు ఎలా ఉండాలనే దృక్ఫథాన్ని కలిగి ఉండాలన్నారు.
ప్రస్తుతం పరిస్థితులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అవకాశాలను ఆవిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ క్రీడల్లో విజేతలకు బహుమతులను అదనపు డీజీపీ నాగిరెడ్డి అందజేశారు.