Saturday, November 23, 2024

KTR | అది డిక్ల‌రేష‌న్ స‌భ‌లా లేదు.. ప్ర‌స్టేషన్ స‌భ‌లా ఉంది: కేటీఆర్‌

చేవెళ్లలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయ‌న ట్విట్టర్ లో ఈ విష‌యాన్ని షేర్ చేసుకున్నారు. అది డిక్లరేషన్ సభ కాదు.. అధికారం రాదనే ప్రస్టేషన్‌తో నిర్వహించుకున్న సభ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

‘అది డిక్లరేషన్ సభ కాదు.. తమకు అధికారం రానే రాదని నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ నిర్వహించుకున్న ప్రస్టేషన్ సభ. కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్.. తెలంగాణకు వచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు? గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారంటీ లేదు. మీ 12 గ్యారంటీలకు విలువ ఎక్కడిది? చైతన్యానికి ప్రతీకలైన తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేసన్ పేరిట విజన్ లేని కాంగ్రెస్ ఇచ్చిన డజన్ హామీలు గాల్లో దీపాలే’ అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement