Sunday, November 10, 2024

TG | మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం మంచిది కాదు.. గుత్తా సుఖేందర్ రెడ్డి

మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం మంచిది కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ‌ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇంతటి గొప్ప పని చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించాలన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా విమర్శించాలి.. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా అభినందించాలన్నారు.

మూసీ ప్రక్షాళన విషయంలో తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని కేటీఆర్ మానుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా కూడా బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన జరిగి తీరాలన్నారు. మూసీ కాలుష్యం మొత్తం నల్లగొండకే వస్తోందని ఆవేదన చెందారు. గతంలో కేసీఆర్ కూడా మూసీ ప్రక్షాళనకు బోర్డు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చెరువుల పరిరక్షణకు హైడ్రా వేగం పెంచి పనిచేయాలని సూచించారు.

ఇదిలా ఉండగా.. 33 బృందాలు మూసీ పరివాహక ప్రాంతంలో పేదల సమస్యలను తెలుసుకున్నాయి. దుర్గంధంలో దుర్భర జీవితాలను గడుపుతున్న పేదల కష్టాలను తెలుసుకున్నాం. ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం. ఉపాధి కల్పనతో అక్కడి పేదలను ఆదుకోవాలనే ఆలోచన త‌మ ప్రభుత్వానికి ఉందన్నారు. ఇది సుందరీకరణ కోసం కాదు.. ఇది మూసీ పునరుజ్జీవనం కోసమని సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement