Friday, November 22, 2024

TS: మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన ఘ‌న‌త కేసీఆర్ దే… రాజ్ నాథ్ సింగ్

మ‌ల్కాజిగిరి – కేసీఆర్ ఒక్క‌డి వ‌ల్లే తెలంగాణ రాలేద‌ని, తాము కూడా స‌హ‌క‌రించ‌డం వ‌ల్లే ప్ర‌త్యేక రాష్ట్రం సిద్దించింద‌ని కేంద్ర‌ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.. మిగులు బ‌డ్జెట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే చివ‌ర‌కు అప్పుల రాష్ట్రంగా మార్చార‌ని ధ్వ‌జ‌మెత్తారు.. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థుల తరఫున రోడ్ షో నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ… తెలంగాణలో ఏర్పడేది బీజేపీ సర్కారేనని స్పష్టం చేశారు.


బీజేపీకి ఏ రాష్ట్రంలోనూ నాయకత్వ సంక్షోభం లేదన్న ఆయన.. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం లేదన్నారు. ప్రతి రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వానికి ఖచ్చితమైన ప్రణాళిక ఉంద‌ని, ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎం పేరును ఖరారు చేస్తామన్నారు. ఎన్నికల తర్వాత నాయకుడిని ఎన్నుకోవడంలో బీజేపీకి ఎలాంటి సమస్య ఉండదన్నారు. అందరి అభిప్రాయాల మేరకే ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తామన్నారు. అయితే తెలంగాణలో మాత్రం ముందస్తుగా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించి, ఎన్నికలకు వెళ్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. సుస్థిర పాల‌న‌కు తెలంగాణ ప్ర‌జ‌లు క‌మ‌లానికి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement