పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. కాచీగూడలో వార్డు ఆఫీసును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లలో మంత్రులు, మేయర్, అధికారులు ప్రారంభించనున్నారు. ఒక్కో వార్డులో 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారు. పారిశుద్ధ్యం, విద్యుత్, టౌన్‌ప్లానింగ్ వంటి వాటిపై ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించనున్నారు.
Ward office : పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం సంతోషకరం.. కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement