సూర్యాపేట, ప్రభ న్యూస్: శర వేగంగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరో మణిహారం చేరనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బుదవారం జూమ్ మీటింగ్ లో ఐటి ఏర్పాటు పై అమెరికా లోని ఆయా ఐటీ కంపెనీ ప్రతినిధులతో సమీక్షించారు.
పాత కలెక్టర్ కార్యాలయం ఐటి టవర్ ఏర్పాటు కు అనువుగా ఉంటుదన్నారు. అందుకు అనుగుణంగా బిల్డింగ్ తీర్చి దిద్దేందుకు వెంటనే పనులు పరిశీలన చేస్తామన్నారు.
రానున్న వారం పది రోజుల్లో ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్దం చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల కు వారధిగా ఉన్న సూర్యాపేటలో ఐటీ టవర్ ఏర్పాటు యువత కు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జూమ్ మీటింగ్ లో రాజ్ సంగాని ,శశి దేవిరెడ్డి, సందీప్ రెడ్డి కట్టా , ఫణి పాలేటి, ప్రియా రాజ్ విజయ్ దండ్యాల, అభిషేక్ బోయినపల్లి మరియు తెలంగాణ ఐటీ ఇన్వెస్ట్ మెంట్ సీఈఓ విజయ్ రంగినేని, టాస్క్ కో -ఆర్డినేటర్ ప్రదీప్ లు పాల్గొన్నారు.