Tuesday, November 19, 2024

IT & ED Raids – నామినేష‌న్ వేయ‌కుండా బిజెపి, బిఆర్ఎస్ ల కుట్ర – ఈసికి పొంగులేటి ఫిర్యాదు …

ఖమ్మం : త‌న‌ను నామినేష‌న్ వేయ‌కుండా చూసేందుకే బిజెపి,బిఆర్ఎస్ పార్టీలు కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయంటూ పాలేరు కాంగ్రెస్ అభ్య‌ర్ధి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.. అర్ధరాత్రి దాటిన త‌ర్వాత త‌న ఇంటిలోనూ, కార్యాల‌యాల‌లోనూ ఈడి, ఐటి అధికారులు సోదాలు జ‌ర‌ప‌డాన్ని ప్ర‌స్తావిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.. అదేవిధంగా త‌న హ‌క్కుల‌కు ఈ రెండు పార్టీలు భంగం క‌లిగిస్తున్నాయంటూ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కు లేఖ రాశారు..

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల బంధం ఫెవికాల్ లాంటిదని , రాష్ట్ర ప్రభుత్వ పై ధ్వజమెత్తారు. తాను నామినేషన్ దాఖలు చేయనున్న అని తెలిసి కుట్ర పూరిత కోణంలో, నామినేషన్ అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు, కుట్రలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. నాకుముందుగానే తెలుసు, దర్యాప్తు సంస్థల ద్వారా భయపెట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తన నామినేషన్ ఘట్టాన్ని ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో దర్యాప్తు సంస్థ ద్వారా ఈ సోదాలు, తనిఖీలు చేస్తున్నారంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంని చూపిస్తోందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement