Friday, November 22, 2024

ISB Summit – రిస్క్ చేస్తేనే.. స‌క్సెస్ సాధ్యం : రేవంత్

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ :ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం చాలా ముఖ్యం, గొప్ప పనుల్లో రిస్క్ తప్పదు, రిస్క్ తీసుకోకుండా ఫలితం సాధించలేమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆదివారం ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సమ్మిట్ ద్వారా మీ అందరిని కలిసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది ఐఎస్‌బీ ఎంచుకున్న లీడర్ షిప్ఇన్ న్యూ ఇండియా థీమ్ అంశంపై తన ఆలోచనలను పంచుకున్నారు. రిస్క్ లేకుండా ఏదీ సాధించ‌లేం..ఐఎస్‌బీలో అసాధారణ విద్యార్థులు చదువుతున్నారని, అందరూ తెలివిగ‌ల వారేన‌ని ప్రశంసించారు.

ఈ సందర్బంగా నాయకత్వ లక్షణాలను వివరిస్తూ.. తన జీవితంలో రాజకీయాల నుంచి నాయకత్వం గురించి నేర్చుకున్నానని సీఎం రేవంత్ తెలిపారు. నాయకత్వానికి తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేసే తత్వం అవసరమని.. వీటితో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా అవసరమన్నారు.

కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన వారసత్వం ఉంది. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి గొప్ప నాయకులే ఇందుకు ఓ ఉదాహరణ అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీకే ఈ నాయకత్వ వారసత్వం ఉందన్నారు. గొప్ప పనుల్లో నిమగ్నం కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని.. రిస్క్ తీసుకోకుండా ఏ ఫలితం సాధించలేమని సీఎం స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement