Wednesday, December 4, 2024

FOLLOW UP : ఎస్ఐ ఆత్మహత్య… ఆమే కారణమా..?

  • సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని వాజేడు ఎస్సై ఆత్మహత్య
  • పూసూర్ రిసార్ట్ లో జరిగిన ఘటన
  • ఎస్సై ఆత్మహత్యపై అనేక అనుమానాలు..?


వాజేడు, డిసెంబర్ 2 ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు ఎస్సైగా పనిచేస్తున్న రుద్రారపు హరీష్ మండల పరిధిలోని పూసూర్ రిసార్ట్ లో తమ సర్వీస్ రివార్వాల్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడడానికి ఆమె వేధింపులే కారణమా అనే చర్చ ప్రజల్లో జరుగుతుంది. వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ యువతి అక్కడ ఎందుకు ఉన్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఆయన సర్వీస్ రివాల్వ‌ర్ తో ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె ఒక్కరే ఉండడంపై వీరిద్దరి మధ్య ఎలాంటి ఘర్షణ జరిగి ఉంటుందో అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రివార్వాల్ తో కాల్చుకొని చనిపోయిన తర్వాత ఆ యువతి మృతదేహంపై పడి రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది.

ఏది ఏమైనప్పటికీ బలమైన కారణం లేకుండా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు పాల్పడలేరు, అనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమ‌వుతున్నాయి. పలువురికి కౌన్సిలింగ్ ఇచ్చి అవేర్నెస్ కల్పించే హోదాలో ఉన్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయన ఆత్మహత్యకు బలమైన కారణం ఉండే ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. వాజేడు ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థలానికి చేరుకున్న వెంకటాపురం సిఐ బండారి కుమార్, ములుగు ఎస్పి శబరీష్ మృతదేహాన్ని పరిశీలించి వ్యక్తిగత కారణాల వలన వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, దీనిపై సమగ్ర విచారణ జరిపి త్వరలోనే నిజానిజాలు బయటికి వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎస్సై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

అసలు ఆమె ఎవరు?
ములుగు జిల్లా వాజేడు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీష్ ను నల్గొండ జిల్లా వాసి అయిన ఓ యువతి ఎస్సైని వేధించడానికి గల కారణాలు ఏమిటి, అసలు వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటనే చర్చ కొనసాగుతుంది. ఆదివారం 7గంటల సమయంలో పూసూరు రిసార్ట్ కు వచ్చిన ఎస్ఐ ఆయనతో పాటు ఉన్నటువంటి యువతి మధ్య ఎలాంటి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణకు గల కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇటీవల వాజేడు ఎస్సై రుద్రారపుకు పెళ్లి సంబంధం కుదరడం, ఈనెల ఆరో తారీఖున ఎంగేజ్ మెంట్ ఉండగా, ఇంతలో ఈ యువతి దర్శనమిచ్చి ఎస్సైని వేధింపులకు గురి చేయడంతోనే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు.

ఆయన విధులు వాజేడు మండలంలోని..
ఎస్సైగా ఎంపికైన రుద్రారపు హరీష్ మొదటిసారిగా వాజేడు ట్రైనీ ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. కొద్ది నెలలుగా విధులు నిర్వహించిన రుద్రారపు హరీష్ వాజేడు మండల పరిధిలోని పేరూరు 29-10-2022 ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. సంవత్సరం పాటు విధులు నిర్వహించి అక్కడి నుండి ములుగు వీఆర్ కు బదిలీ అయ్యారు. తర్వాత వాజేడు ఎస్సైగా 2024, జూన్ 17న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి నేటి వరకు ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పెంపొందిస్తూ ప్రజలకు సేవలు చేశారు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా తమ సొంత సర్వీస్ రివాల్వర్ తోనే కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో వాజేడు ప్రజలు విషాదానికి గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement