Saturday, September 14, 2024

Irrigation – సీతారామతో సాగుకు అమృతధార

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, ముల‌క‌ల‌ప‌ల్లి (భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా) : మండ‌లంలోని పుసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు ట్ర‌య‌ల్ ర‌న్ ను అధికారులు నిర్వ‌హించారు. ఈ ట్ర‌య‌ల్ ర‌న్ విజ‌య‌వంత‌మైంద‌ని నీటి పారుద‌ల శాఖ అధికారులు వెల్ల‌డించారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప‌రిశీలించారు. అక్క‌డి నుంచికమలాపురం పంపు హౌస్ కు మంత్రులు చేరుకున్నారు. అలాగే కమలాపురం వద్ద ఉన్న ఐదో పంపు హౌస్ ను కూడా మంత్రులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, పలువురు రాష్ట్రస్థాయి, జిల్లా ఇరిగేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఏటా ఆరు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు : మంత్రి ఉత్త‌మ్‌

ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏటా ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.

రీడిజైన్‌తో ఎనిమిది వేల కోట్లు వృథా

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రీ డిజైన్ పేరుతో గత పాలకులు ఎనిమిది వేల కోట్లు వృథా చేశారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక జిల్లాలో అనేక నియోజకవర్గాల రైతులకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని చెప్పారు. భద్రాచలం, ఎల్లందు నియోజకవర్గ రైతులకు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement