Friday, December 27, 2024

TG | పోష‌కాహార పంపిణీలో అవ‌క‌త‌వ‌క‌లు.. అంగన్వాడీ టీచర్ల సస్పెండ్

  • ..బాలామృతం విక్రయ దారులపై కేసు నమోదు
  • .. కలెక్టర్ హనుమంతరావు


ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : పోషకాహార పంపిణీలో లబ్దిదారులకు పోషకాహార పంపిణీ జరకగకుండానే ఆన్ లైన్ లో ఖర్చు చేసినట్లుగా చూపించి పోషకాహార పంపిణీలో అవకతవకలతో సంబంధిత అంగన్వాడీ కేంద్రాల టీచర్లను తాత్కాలికంగా విధుల నుండి సస్పెండ్ చేస్తూ తదుపరి విచారణకు ఆదేశించినట్లు కలెక్టర్ హనుమంతరావు బుధవారం తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో పశువుల పాకలో బాలామృతం ఉన్నట్లు సమాచారంతో ఏస్.ఓ.టి పోలీసులు చీమల నరేశ్ పశువుల పాక నుండి (9) బస్తాల బాలామృతం( 180 కేజీలు) స్వాధీన పరుచుకోవడం జరిగింది. తదుపరి చీమల నరేశ్ ని విచారించగా ఆ బాలామృతం మోత్కూర్ కు చెందిన బీసు ప్రశాంత్ (బాలామృతం పంపిణీ దారుడు) దగ్గర తీసుకున్నట్లుగా పోలీసులకు తెలిపాడు.

అనంతరం మోత్కూర్ పోలీసులు ప్రశాంత్ ఇంటి దగ్గరికి వెళ్ళి చూడగా.. ఇంటిలో 100కేజీల బాలామృతం, 48లీటర్ల పాలు దొరికాయి. ఈ విషయాన్ని ఏస్.ఓ.టి పోలీసులు జిల్లా సంక్షేమ అధికారికి సమాచారం ఇవ్వగా, వెంటనే స్పంధించి ఆ సమాచారంను జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు తెలిపారు.

- Advertisement -

తదుపరి భువనగిరి ప్రాజెక్టు సీడీపీవో ఆ వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారించగా, పట్టుబడిన బాలామృతం 4 అంగన్వాడీ కేంద్రాలైన‌ ఆలేర్ ప్రాజెక్టుకు చెందిన మంతపురి, పుట్టగూడెం, యాదగిరిగుట్ట-III, మోత్కూర్ ప్రాజెక్ట్ కు చెందిన మోత్కూర్-VII వ అంగన్వాడీ కేంద్రాలకు సంబదించినదిగా విచారణలో తెలిసింది. తదుపరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అద‌నపు కలెక్టర్ (LB) ఆధ్వ‌ర్యంలో పరిశీలించగా, సీడీపీవో మోత్కూర్, ఆలేరు ఆ నాలుగు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement