Friday, November 1, 2024

TS | ఇంటింటా ఇన్నోవేటర్ దరఖాస్తుల ఆహ్వానం.. సమస్యలకు పరిష్కారం కనుగొనాలి: కలెక్టర్ శరత్

ఉమ్మడి మెదక్​ బ్యూరో, (ప్రభ న్యూస్​): ఇంటింటా ఇన్నోవేటర్ కు ఆవిష్కర్తల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఇవ్వాల (సోమవారం) తెలిపారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో ఇంటింటా ఇన్నోవేషన్ పోస్టర్ ను జిల్లా అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ నగేష్, జిల్లా అధికారుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు.

సామాజిక సమస్యలకు విస్తృతమైన పరిష్కారాలు రూపొందించిన వారి ఆవిష్కరణలు ఆగస్టు 15 వ తేదీ  స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శించడానికి రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ అవకాశం కల్పిస్తున్నట్లు  పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఉన్న ఆవిష్కర్తలను.. వివిధ సమస్యలకు పరిష్కారం కనుగొనేలా ఈ కార్యక్రమం ప్రోత్సాహం కల్పిస్తుందని కలెక్టర్ వెల్లడించారు. ఎంపికైన ఆవిష్కరణలు స్వాతంత్ర దినోత్సవం రోజు జిల్లాలో ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.

మన సమాజంలో లేదా చుట్టుపక్కల ఉన్న సమస్యలు, విద్యాలయాల్లో, వ్యవసాయరంగానికి ఇలా.. ఏ రంగానికి సంబంధించినదైనా సరే.. వాటిని పరిష్కరించే వినూత్న ఆలోచన, పరికరమే ఆవిష్కరణగా రూపొందుతుందని పేర్కొన్నారు.  ఏదైనా సమస్యకు కొత్త పరిష్కారం కనుక్కున్నా, సమస్యకు పరిష్కారం కనుక్కునే విధానం నూతనంగా ఉన్నా వాటిని ఆవిష్కరణగా పేర్కొంటారని, అదేవిధంగా ఒక పరికరం చేస్తూ దానిలో ఉపయోగించే వస్తువులు, పరికరాలు వినూత్నంగా ఉన్నా, ఉన్న వస్తువులకు మరింత ఆలోచన జోడించి వస్తువు ఉపయోగాలు పెరిగినా ఆవిష్కరణగా పరిగణిస్తారని వివరించారు.

ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియోను.. ఆవిష్కరణ నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం, జిల్లా పేరుతో సహా ఆగస్ట్ 5వ తేదీ లోగా 9100678543 కి వాట్సాప్ చేయాలని కలెక్టర్​ శరత్​ సూచించారు. దీనికి సంబంధించిన ఏదైనా డౌట్​ ఉన్నా. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి సెల్ నంబర్ 9963423691లో సంప్రదించాలని సూచించారు. జిల్లాలోని అన్ని రంగాలకు చెందినవారు తమ ఆలోచనలకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలను పెద్ద మొత్తంలో పంపి జిల్లాను ముందు స్థానంలో నిలబెట్టాలని కలెక్టర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement