మహబూబ్‌నగర్, (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో యువతకు డిప్లోమా కోర్సులో (3) సంవత్సరాలు పాటు శిక్షణ ఇవ్వటానికి ఇండియన్ ఇన్సిట్యూట్ ఆప్ హ్యాండ్ టూమ్ టెక్నాలజీ, బర్గ, ఒడిస్సా, రాష్ట్రం వారు ఆసక్తిగల అభ్యర్దులు నుండి ధరఖాస్తు కోరుతున్నట్లు చేనేత మరియు జౌళి శాఖ సహాయ సంచాలకుల డి. బాబు తెలిపారు. ఇందుకోసం తెలంగాణ (9) సీట్లు కేటాయించడం జరిగిందని అందులో ఒక సీటును ఈ, డబ్ల్యు, ఎస్ కేటగిరి వారికి రిజర్వేషన్లు తెలిపారు.
శిక్షణ కోరు అభ్యర్దులు పదవ తరగతి ఉత్తీర్ణులైన ఉండి 16-07-2022 నాటకి బి.సి జనరల్ కేటగిరీ వారు 15 నుండి 23 సంవ;ల లోపు వయస్సు ఎస్సీ, ఎస్టీ కేటగిరి వారు 15 నుండి 25 సం; ల లోపు వయస్సు కలిగిన వారు అరుహూలు అని పేర్కోన్నారు. ఆసక్తి గల అభ్యర్దులు జూన్ 10వ తేది లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోరకు సహాయ సంచాలకులు, చేనేత మరియు జౌళి శాఖ, మహబూబ్‌నగర్ కార్యాలయమును సంప్రదించాలని పేర్కోన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..