యాదాద్రి, ప్రభన్యూస్ : షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు స్కిల్ డెవెలప్మెంట్ కోర్సులలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో యువజన సర్వీసుల శాఖచే ఏర్పాటు చేయబడిన శిక్షణా కేంద్రంలో విద్యావంతులైన షెడ్యూల్ కులముల నిరుద్యోగ యువతకు జిల్లా షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ద్వారా పూర్తిగా ఉచిత వసతి, వసతి లేకుండా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గార్మెంట్ మేకింగ్ (టైలరింగ్), బ్యూటీషియన్, డోమెస్టిక్ ఎలక్ట్రీషియన్ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని 7వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారికి ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, 10వ తరగతి ఉతిర్ణత, లేదా ఫెయిల్ అయిన వారికి మొబైల్ సర్వీసింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఇట్టి కోర్సులకు గాను 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులని, శిక్షణా కాలం 3 నెలలు ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతం వారికి రూ.1.5 లక్షలు ,పట్టణ ప్రాంతం వారికి రూ 2 లక్షలు మించరాదని చెప్పారు. ఆసక్తిగల అభ్యర్ధులు శిక్షణ పొందుటకుగాను ఆధార్, కుల ధృవీకరణ, స్థానిక ధృవీకరణ, ప్రస్తుత సంవత్సరపు ఆదాయ ధృవీకరణ మొదలైన ధృవ పత్రాలను జత చేసి ఈ నెల 25వ తేదీలోగా కార్యనిర్వాహక సంచాలకులు, జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకారుల అభివృద్ది సంస్థ పాత మున్సిపల్ కాంప్లెక్స్, యాదాద్రి భువనగిరి కార్యాలయమునకు పోస్టు ద్వారా, లేదా స్వయంగా అందజేయాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital