తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు. వ్యక్తిగత ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు రేవంత్ సూచించారు..
జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని లేఖలో పేర్కొన్నారు. . కేసీఆర్ ను స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందించేందుకు కేసీఆర్ సిబ్బందితో చర్చలు జరుపుతున్నారు. గజ్వెల్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉన్నారని సిబ్బంది తెలిపారు. అక్కడకు వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక, లేఖను అందించేందుకు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ ప్రయత్నిస్తున్నారు.
- Advertisement -