హైదరాబాద్ – కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు. హైదరాబాద్‌లోని నాగం నివాసానికి వెళ్లిన మంత్రులు..ఈ మేరకు చర్చలు జరుపారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ టికెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో నాగం అసంతృప్తిగా ఉన్నారు. దీంతో హస్తం పార్టీని వీడారు నాగం. అంతకు ముందు నాగం జనార్ధన్ రెడ్డితో బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మంతనాలు జరిపారు.. ఈ నేపథ్యంలోనే కెటిఆర్, హారీష్ రావులు స్వయంగా నాగంతో రాజకీయ భవిష్యత్ గురించి మాట్లాడారు..పార్టీలో గౌరవప్రద స్ధానం కల్పిస్తామని సీనియర్ నేతకు హామీ ఇచ్చారు..
Invitation – కారెక్కెండి సారూ…నాగంను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించిన కెటిఆర్, హరీష్ రావు..
Advertisement
తాజా వార్తలు
Advertisement