2022-24 సంవత్సరానికి తెలంగాణలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకోసం సమాచార, పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు 30.06.2022తో ముగుస్తుంది. 2022-24 సంవత్సరాల్లో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్ కార్డ్‌లు జారీ చేస్తారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ ఏజెన్సీల యాజమాన్యాలు తమ సంస్థలకు చెందిన వర్కింగ్ జర్నలిస్టుల పేర్ల జాబితాను 04.06.2022లోపు సమాచార, ప్రజాసంబంధాల విభాగానికి తప్పనిసరిగా సమర్పించాలని కోరారు. ఇండిపెండెంట్ జర్నలిస్టులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కార్డుల పేర్లను కమిషనర్, సమాచార, పౌరసంబంధాలు, హైదరాబాద్‌కు పంపాలి. జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కార్డుల పేర్లను జిల్లాల సంబంధిత డీపీఆర్వోలకు పంపాలి. మేనేజ్‌మెంట్లు తమ పేర్లను పంపిన జర్నలిస్టులు 25.05.2022 నుంచి 04.06.2022 వరకు డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ http://ipr.telangana.gov.in ద్వారా అక్రిడిటేషన్ కార్డుల కోసం తమ దరఖాస్తులను సమర్పించాలని అభ్యర్థించారు.