Tuesday, November 26, 2024

Investors Hub క్యూ కట్టిన ఫారెన్​ ఫండ్స్​ … పెట్టుబ‌డుల‌కు తెలంగాణ గ‌మ్య‌స్థానం

ప్ర‌పంచ దేశాల చూపంతా ఇప్పుడు తెలంగాణ వైపే ఉంది.. ఎందుకంటే ఇక్క‌డ పెట్టుబ‌డి పెడితే త‌మ సంప‌ద ప‌దింత‌లు అవుతుంద‌న్న గ్యారెంటీ వారికి క‌లిగింది. కావాల్సిన మ‌న‌వ వ‌న‌రులు, భూమి, నీటి వ‌న‌రులు.. అందులో సేఫ్టీ కూడా ఉంద‌న్న భావ‌న‌తో పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా తెలంగాణ మారింది. దీనికంత‌టికీ సీఎం కేసీఆర్ తీసుకున్న చ‌ర్య‌లు.. అందులో మంత్రి కేటీఆర్ చాతుర్యం ఎంతో ఉంద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.. ఇక లేటెస్ట్‌గా 9,679 కోట్ల‌తో ఎఫ్డీఐలు వ‌చ్చిన‌ట్టు వాణిజ్య శాఖ లెక్క‌లు రిలీజ్ చేసింది. ఈ అయిదేండ్ల‌లో తెలంగాణ క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడుల‌ను మించి విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులను సాధించి స‌గ‌ర్వంగా దేశంలోనే ఆరో స్థానంలో నిలుచుంది..

లెక్క‌లు తేల్చిన కేంద్ర వాణిజ్య‌శాఖ‌..
డబ్బులు ఊరకే రావు. చెట్లకు కాయవు.. మరెట్ల వస్తయ్. కష్టంపై ఇష్టం ఉండాలి. శ్రమించే శక్తి కావాలి. ఈ రెండింటిలో కొదువ లేదు. కరువు లేదు. పనికి ఇక్కడి జనం పారిపోరు. మీ జేబులో డబ్బు పదిలం, లాభాల పంట ఖాయం అని ఆకర్షించే నాయకత్వం తప్పనిసరి. ఇవ్వన్నీ ఎక్కడుంటే.. అక్కడకు .. పెట్టుబడులు ఉరుకవా? పరుగు, పరుగునా పరుగులెత్తవా? ఈ పచ్చి నిజాన్ని తెలంగాణలో కేసీఆర్ సారధ్యంలో న‌డుస్తున్న బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిరూపించింది. ఇంకా నిరూపిస్తూనే ఉంది. కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ర్టీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా.. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడానికి క్యూకట్టిన సంస్థల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకూ సంపద పెంచాం, సంపద పంచుతున్నాం, అని బీఆర్ఎస్ నేతలు పదే పదే అంటుంటే.. ఊరకే ఎన్నికల్లో ఊదరగొడతారని ప్రతిపక్షాలూ ఈసడించుకొంటున్నాయి. కానీ, డీపీఐఐటీ నివేదిక ప్రకారం పరిశీలిస్తే.. పదేళ్ల కిందట అభివృద్ధి ప్రస్థావనాన్ని ప్రారంభించిన తెలంగాణ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించటంలో ఎక్కడా తగ్గటం లేదు.

కొత్త రాష్ట్రం అయినా.. వ‌డి వ‌డిగా
కొత్త రాష్ట్రంగా ఏర్పడినా.. అర్ధ శతాబ్ద చరిత్ర కలిగిన మహారాష్ట్ర‌, కర్నాటక, గుజరాత్, తమిళనాడు, కేంద్రపాలిత ఢిల్లీతో పోల్చితే .. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ 6వ స్థానంలో నిలిచింది. భవిష్యత్తులో ఈ 5 రాష్ట్రాల‌ను అధిగమించటం కష్టం కాద‌ని ఈ ప‌రిస్థితిని గ‌మిన‌స్తే ఇట్టే తెలిసిపోతోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

వ‌రుస‌క‌ట్టిన విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు..
2019 నుంచి దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సరళిని పక్కన పెడితే.. ఈ ఏడాది రూ,1.68 లక్షల కోట్ల పెట్టుబడి దేశంలోకి వచ్చింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చిన పెట్టుబడుల్లో మహారాష్ట్ర‌, ఢిల్లీ, కర్నాటక, గుజరాత్, తమిళనాడు తొలి ఐదు స్థానాల్లో ఉంటే.. తెలంగాణ 6వ స్థానంలో నిలిస్తే.. పక్కనే ఆంధ్రప్రదేశ్ 11 స్థానంలో ఉంది. తొలి ఐదు రాష్ట్రాల‌కు 1.44 లక్షల కోట్లు (85.5 శాతం) వ‌స్తే.. ఒక్క తెలంగాణకు రూ,9,679 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి. ఆంధ్ర ప్ర‌దేశ్‌కి రూ.630.80 కోట్లు లభించాయి.

- Advertisement -

2019 నుంచి 45,445 కోట్ల పెట్టుబ‌డులు
కేంద్ర ప్రభుత్వం గుర్తించిన‌ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందిన రాష్ట్రాల సమాచారం మేరకు.. 2019 నుంచి తెలంగాణకు రూ.45,445 కోట్లు పెట్టుబడి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.6,679 కోట్లే లభించాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మరిన్ని విదేశీ సంస్థలు ప్రస్తుతం బారులు తీరటం విశేషం. తెలంగాణలో మౌలిక సదుపాయాలు, మానవ వనరులకు కొదువ లేకపోవటంతోనే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణుల విశ్లేషణ. ఇదంతా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చొర‌వ‌.. మంత్రి కేటీఆర్ చాతుర్యంతోనే సాధ్య‌మ‌య్యింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement