Sunday, November 24, 2024

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అరైవల్‌ యూకే కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా కంపెనీకి చెందిన విద్యుత్‌ బస్సులు ,వ్యాన్‌లు, అంబులెన్సులను హైదరాబాద్‌లో ప్రవేశపెట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ విద్యుత్‌ బస్సులు, వ్యానులు తయారు చేసే అరైవల్‌ యూకే ప్రతినిధులను కోరారు. యూకే పర్యటనలో భాగంగా శనివారం బాన్‌బెరీలో అరైవల్‌ యూకే కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్‌ బృందం భేటీ అయింది.

హైదరాబాద్‌లోని అల్లాక్స్‌ కంపెనీతో ఇప్పటికే అరైవల్‌ యూకే కలిసి పనిచేస్తోంది. అల్లాక్స్‌ రీసోర్సెస్‌ ప్రతినిధులు కూడా ఈ భేటీలో మంత్రి వెంట ఉన్నారు. హైదరాబాద్‌లో మెట్రో లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ కోసం కంపెనీ బస్సులు ప్రవేశపెట్టాల్సిందిగా కేటీఆర్‌ ఈ సందర్భంగా అరైవల్‌ యూకే ప్రతినిధులను విజ్ఞప్తి చేశారు. ఈవీ రంగంలో ఇప్పటికే ముందున్నామని, అరైవల్‌ యూకే కూడా తమతో చేతులు కలిపితే ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో మరింత వేగంగా ముందుకెళతామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement