కరీంనగర్ : హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల ఎన్నికల ఇంఛార్జిగా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిని నియమిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ లో జరిగిన ప్రజా ఆశీర్వధ సభలో ప్రకటించారు.
నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు మంత్రి కేటీఆర్, మంత్రి గంగుల, ప్లానింగ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ ఎమ్మెల్యేలు రసమయి లతో పాటు సుంకే రవిశంకర్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవీ రామకృష్ణ, ఎమ్మెల్సీలు భానుప్రసారావు, ఎల్ రమణ, నగర మేయర్ వై.సునీల్ రావు, పలువురు కార్పొరేటర్లు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం లభించింది. హెలిపాడ్ నుండి సభాస్థలి వరకు నీరాజనం పలికారు. సభ విజయవంతం కావడం పట్ల మంత్రి గంగుల నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.