వికారాబాద్ : క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికే ప్రజా క్షేత్రంలోకి వస్తున్నానని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఈ రోజు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా కోట్ పల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాంపూర్ గ్రామ రైతులకు పంట పొలాల్లోకి వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉన్న పానాది (పార్మిషన్) రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఊరు మధ్యలో పాడు బడ్డ ఇళ్లను వెంటనే తొలగించి, మురుగు కాలువలు ఎప్పటికప్పుడు పారిశుద్య కార్మికులతో శుభ్రపరచాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆదేశించారు. పాత బావుల పైకప్పుల ఏర్పాటు వెంటనే పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. మిషన్ భగీరథ నీటి పైపుల లీకేజీలు లేకుండా, నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement