Saturday, November 23, 2024

‘ఇంటింటా ఇన్నోవేటర్’.. ఆవిష్కరణలు పంపడానికి గడువు ఆగస్ట్ 10!

తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ ,  సృజనాత్మకతను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ఆలోచనలకు పదును పెట్టడం, వాటికి సృజనాత్మకతను జోడించి ఆవిష్కరణలు చేపట్టే వారిని ప్రోత్సహిండానికి ఇంటింటా ఇన్నోవేటర్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. దీనికి సంబంధించి దరఖాస్తు గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారు. ఇందులో పాఠశాలలు, కళాశాల స్థాయిలోని విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, మెకానిక్‌లు, వ్యవసాయదారులు, మహిళలు ఇలా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభకు రూపం ఇచ్చేలా వారిని ప్రోత్సహించడం కోసం 2019-20 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్‌ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల ప్రదర్శన చేపట్టనున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.

తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలు ఒకేసారి ఆయా జిల్లాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్లైన్ లో ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రదర్శన జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంటుంది. ప్రదర్శించిన ఆవిష్కరణలలో ఉత్తమ ఆవిష్కరణలను, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వాటిని ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమాలతో తోడ్పడుతుంది. ఆన్ లైన్ ఎగ్జిబిషన్ లింక్ ద్వారా ప్రజలు ఆవిష్కరణలను చూడవచ్చు.

ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, దానికి సంబంధించి రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణ నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు, 9100678543 నంబర్‌కు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ 10 ఆగస్ట్. ఎంపికైన వాటిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. స్వాతంత్య్ర దినోత్సవ రోజున ఆవాటిని ఆన్‌లైన్‌లో ప్రదర్శిస్తారు. వాటిలో ప్రతిజిల్లా నుంచి ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement