Monday, December 23, 2024

TG | అంతరాష్ట్ర దొంగ అరెస్టు.. 31తులాల బంగారం స్వాధీనం..

జగిత్యాల డీఎస్పీ రఘు చందర్


జగిత్యాల, ఆంధ్రప్రభ : అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. సోమవారం పట్టణంలోని సబ్ డివిజినల్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవలే జరిగిన దొంగతనం కేసులో అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పట్టుకోవడానికి టౌన్ ఇన్స్ పెక్టర్ వేణు గోపాల్ ఆధ్వర్యంలో బృందం ముమ్మరంగా గాలింపు చేపట్టిందన్నారు.

ముఠా సభ్యురాలు హత్గాడే కాంతను సోమవారం పట్టణంలోని టవర్ సర్కిల్ లో గల ఓ బంగారం దుకాణంలో అదుపులోకి తీసుకున్నామన్నారు. గత కొంతకాలంగా ఈ ముఠా సభ్యులు మంచిర్యాల లక్ష్టిపేట, జగిత్యాల, సిరిసిల్ల, ఆర్మూర్, నిజామాబాద్ బస్టాండుల్లో నిఘా ఉంచి వచ్చి పోయే ప్రయాణికులపై దృష్టి పెట్టి వారి వద్ద ఉన్న విలువైన బంగారు ఆభరణాలను వారికి తెలియకుండా దొంగలిస్తున్నారని తెలిపారు.

- Advertisement -

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ లో ఇటీవలే ఓ మహిళపై నిఘా ఉంచి ఆమెకు తెలియకుండా ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దొంగలించారని, దొంగలించిన బంగారు ఆభరణాలను అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో సోమవారం పట్టణంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో ముఠా సభ్యురాలైన మహారాష్ట్రకు చెందిన హాత్గాడే కాంతను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుండి 31 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ముఠా సభ్యులైన హాత్గాడే గుజాన, సంజన నాడే లను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే డయల్ 100, స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో టౌన్ ఇన్స్ పెక్టర్ వేణుగోపాల్, ఎస్ఐ కిరణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నసీర్ ఖాన్, కానిస్టేబుల్ కిరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement