Wednesday, October 16, 2024

TS: అంతర్‌ రాష్ర్ట గంజాయి ముఠా అరెస్ట్‌… 6.5 కిలోల గంజాయి స్వాధీనం

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
అంతర్ రాష్ట్ర గంజాయి సరఫరా ముఠాను అరెస్టు చేసినట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి నుండి 6.50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.

గంజాయి సరఫరా చేస్తున్న ఒడిస్సాకు చెందిన ఒకరిని, ఏపీకి చెందిన వ్యక్తితో పాటు ధర్మపురికి చెందిన మరొకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి 3 సెల్‌ ఫోన్లు, రూ.3500 నగదును స్వాధీనం చేసుకున్నమన్నారు. మీడియా సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘుతో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement