Tuesday, November 26, 2024

TG: ప్రతి గ్రామానికీ ఇంటర్ నెట్… మంత్రి శ్రీధర్ బాబు

ఇప్పటికే 8000 గ్రామాల‌కు సౌక‌ర్యం
మరో 3000 గ్రామాలకు కల్పిస్తాం
ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, క‌రీంన‌గ‌ర్ : ప‌త్రి గ్రామానికీ ఇంట‌ర్‌నెట్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య ప‌న్నుల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు అన్నారు. ప్ర‌జాపాల‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న అర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మీడియా తో మాట్లాడారు. టెలిఫోన్ ప్రతి ఇంట ఉండాలని తీసుకొచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. అలాగే దేశ సమగ్రతలలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు నెహ్రూ అని, దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన వీరవనిత ఇందిరా గాంధీ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన నాయకురాలు సోనియా గాంధీ భర్త భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కొంతమంది జీర్ణించుకోలేక పోతున్నారని విమ‌ర్శించారు.

మ‌రో మూడు వేల గ్రామాల‌కు నెట్ సౌక‌ర్యం…
ఫైబర్ నెట్వర్క్ 8000 గ్రామాలకు నెట్వర్క్ అందించామని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు అన్నారు. మరో 3000 గ్రామాలకు నెట్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో మూడు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని నెట్వర్క్ సదుపాయం కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు గ్రామం, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement