Tuesday, September 17, 2024

TG | అంతర్జాతీయ టెన్నిస్ క్రీడలు ప్రారంభం…

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : హైదరాబాద్ తరహాలో భువనగిరి క్రీడా రంగంలో అభివృద్ధి చెందుతుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూ డైమెన్షన్ టెన్నిస్ అకాడమీలో రాజ నర్సింహారావ్ మెమోరియల్ ఐటిఎఫ్ అంతర్జాతీయ జూనియర్స్ జె 60 అండర్ 18 టెన్నిస్ క్రీడలను ప్రారంభించారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 8 కోర్టులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జ్యోతి ప్రజ్వలన గావించి క్రీడలను ప్రారంభించారు. వారం రోజుల పాటు నిర్వహించే టెన్నిస్ క్రీడల్లో 170 మంది యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, నేపాల్, వివిధ దేశాల నుంచి అంతర్జాతీయ పాల్గొననున్నట్లు తెలిపారు.

అనంతరం ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐటిఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అశోక్ కుమార్, న్యూ డైమెన్షన్ టెన్నిస్ అకాడమీ డైరెక్టర్ పులిమామిడి సుభాష్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కె ఆర్ రామన్, కార్యదర్శి నారాయణ దాస్, జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, దిడ్డి బాలాజీ, ఐటిఎఫ్ సూపర్ వైజర్ శివ రెడ్డి, సందీప్ రెడ్డి, శివాని రెడ్డి, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement