Friday, November 22, 2024

TS: మానేర్ రివర్ ఫ్రంట్ తో అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ మెంట్… మంత్రి గంగుల

మానేర్ రివర్ ఫ్రంట్ తో అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్ డెవలప్ కానుందని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా… నగరంలోని మానేరు డ్యామ్ వద్ద విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్బంగా పలువురు వాకర్స్ తో ఆయన ముచ్చటిస్తూ… వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాకర్స్ ను కలుస్తూ… ఓట్లను అభ్యర్థించారు. కారుగుర్తుకే ఓటెయ్యాలని కోరారు. అనంతరం రాగి జావా తాగుతూ… కాసేపు సేద తీరారు. విశ్రాంత ఉద్యోగి ఆనందం మంత్రి గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. రోడ్లు, హరితహారం, శుభ్రత, మంచినీరు అన్నీ అంశాల్లో కరీంనగర్ అభివృద్ది చెందిందని… ఆనందం తెలిపారు.

ఇంతలా అభివృద్ది చెందుతుందని అనుకోలేదన్నారు. వీటన్నింటిపై అవగాహన, తపన ఉన్న నాయకుడినే గెలిపించాలని… ఇందుకు అర్హుడు గంగుల కమలాకర్ మాత్రమేనని కొనియాడారు. నాలుగోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామని… గంగుల కమలాకర్ అన్నారు. సీఎంగా కేసీఆర్ కు మరోసారి అవకాశం కల్పిస్తే… పూర్తి స్థాయిలో అభివృద్ది కొనసాగుతుందని చెప్పారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ లో ఆ స్థాయిలో డెవలప్ మెంట్ జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు మంత్రి సోదరుడు గంగుల సుధాకర్, కార్పొరేటర్ దిండిగాల మహేశ్, మాజీ కార్పొరేటర్ ఏవీ రమణ, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మానేరు వాకర్స్ అధ్యక్షుడు కనకాచారి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ రెడ్డి, లేక్ వాకర్స్ అధ్యక్షుడు లింగయ్య, ప్రధాన కార్యదర్శి తిరుపతి, మాజీ ఎంపీటీసీ ఉప్పు శ్రీనివాస్, వాకర్స్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement