Wednesday, December 18, 2024

TG | వనపర్తికి ఇంటర్నేషనల్ సమీకృత భవనం… రూ.150 కోట్లతో నిర్మాణం

వనపర్తి ప్రతినిధి, (ఆంధ్ర ప్రభ) : వనపర్తికి సమీకృత భవనం మంజూరు అయిందని.. దీనిని ఇంటర్నేషనల్ లెవల్ మాదిరిగా తయారు చేసేందుకు రూ.150 కోట్ల తో నిర్మాణం చేపడుతున్నామని.. వీటివల్ల 2500 మంది విద్యార్థులకు చదువుకోడానికి వెసులుబాటు ఉంటుందని ఎంపీ. మల్లు రవి అన్నారు.

ఆదివారం వనపర్తిలోని నాగవరం కస్తూర్బా గాంధీ, గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే. మేఘా రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలోఎంపీ మల్లు రవి మాట్లాడుతూ కస్తూర్భ గాంధీ పాఠశాల మంచి విద్యతో పాటు.. నాణ్యమైన భోజనం ఉంటోందన్నారు.

మేం చదువుకునే కాలంలో సరిగా వసతులు లేవని..ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చాలా బాగున్నాయని పేర్కొన్నారు.నేను కూడా సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకొని ఎమ్మెల్యే, ఎంపీగా అయ్యానని..మీరు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయి లో ఉండాలని అన్నారు.

మీరు మంచి మేధావులుగా అయ్యో అవకాశం మీ చేతుల్లోనే ఉన్నదని, సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని సూచించారు. మీ చదువుకు కావలసిన అన్ని వసతులు కల్పించే బాధ్యత నాదన్నారు.పార్లమెంటుకు సంబంధించిన నిధులు 5 కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఖర్చు చేయడం జరుగుతుందని, పాఠశాల అభివృద్ధి కోసం రూ.5 కోట్ల ఖర్చు చేస్తానని అన్నారు.

రూ.150 కోట్లతో ఇంటర్నేషనల్ సమీకృత భవనం

- Advertisement -

వనపర్తిలో సమీకృత భవనం మంజూరు అయిందని,దాదాపుగా 2500 మంది విద్యార్థులు చదువుకోడానికి వెసులుబాటు ఉంటుందని ఎంపీ. మల్లు రవి అన్నారు.ఇంటర్నేషనల్ లెవల్ మాదిరిగా తయారు చేస్తానని..దాదావు రూ.150 కోట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పించి,విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తానని అన్నారు.గత ప్రభుత్వంలో పాఠశాలలో అభివృద్ధి పరచకుండా ఇబ్బందులకు గురి చేశారని వెల్లడించారు.

తెలంగాణ వచ్చినప్పుడు రూ.17వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్టాన్ని 10ఏండ్లలోనే కేసీఆర్ అప్పుల రాష్ట్రoగా మార్చారని మండిపడ్డారు. గత పాలకులు రూ.7 లక్షలు కోట్ల అప్పులు చేసి వెళ్లారని..దానికి గాను ఇప్పుడు రూ.6 కోట్ల వడ్డీ కడుతున్నామని విమర్శించారు.అప్పుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికoగా ఇబ్బందిలో ఉందని,ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా అడిగమిస్తూ ముందుకు వెళ్తుందన్నారు.

పాఠశాలు, హాస్టళ్లలో సమస్యలు పెట్టి వెళ్లిన కేసీఆర్ ప్రభుత్వం:ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి

వనపర్తి నియోజవర్గంలో ఉన్న కస్తూర్బా గాంధీ,గురుకుల స్కూల్ లో గత పాలకుల పాలనలో సమస్యలు పెట్టి వెళ్లారని..ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని సమస్యలు తీరుస్తామన్నారు.మీకు ఎలాంటి సమస్యలు లేకుండా మేం చూసుకుంటామని,సక్కగా చదువుకోవడానికి కావలసిన అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు.

మీరు కష్ట పడి బాగా చదువుకోని, జీవితంలో ఉన్నత స్థాయి ఎదగాలని అన్నారు.ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పుట్ట పాకాల మహేష్, మాజీ పీసీసీ డెలిగేట్ సభ్యులు శంకర్ ప్రసాద్, ఎంపీపీ కిచ్చా రెడ్డి ,ఎంపీపీ శంకర్ నాయక్,సింగిల్ విండో డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, మైనారిటీ నాయకులు రహీం, స్కూల్ ప్రిన్సిపాల్, కేజీవీబీ అధికారి సుబ్బ లక్ష్మి, స్కూల్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement