హైదరాబాద్ – రాష్ట్ర బీజేపీలో స్తబ్ధత నెలకొన్న వేళ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది… కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో చర్చలకు సిద్దమైంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఈ ఇద్దరు నేతలు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు.. . రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల వేళ ఆదివారం రోజున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు.
ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న నడ్డా.. సంపర్క్ సే సంవర్ధన్‌లో భాగంగా ఇద్దరు ప్రముఖులను వారి నివాసాలకు వెళ్లి కలవనున్నారు. ఈ క్రమంలోనే మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా సాయంత్రం 5 గంటలకు నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. సభ అనంతరం హెలికాప్టర్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి 6:45 గంటలకు దిల్లీకి తిరుగు పయనం కానున్నారని చెప్పాయ. ఇప్పటికే ఆయన సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర నాయకత్వం పూర్తి చేసింది.