తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1768 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈసారి 70 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల 31 ఆదివారం రోజున సైతం పరీక్ష నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: T20 World Cup: భారత్ పై పాక్ గెలుపు.. లెక్క ఎక్కడ తప్పింది?