హైదరాబాద్ : మధుర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సులో నుంచి ఓ విద్యార్థిని కాలుజారి పడింది. దీంతో ఆమె బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపి వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతురాలిని యూసుఫ్‌గూడలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న మెహరీన్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
- Advertisement -