ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ గడువును పెంచుతూ తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్లో ప్రవేశానికి గడువును ఈ నెల 31 వరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురువారం పొడిగించింది. ఈ సందర్భంగా ప్రైవేటు కాలేజీలు నిబంధనలు పాటించాలని బోర్డు కార్యదర్శి జలీల్ ఆదేశించారు. కొన్ని కాలేజీలు అనుమతి లేకుండా ప్రవేశాలు చేపట్టాయని ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించొద్దని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ నీటి పారుదల శాఖకు కొత్తగా 879 పోస్టులు