Tuesday, October 1, 2024

ఇంటర్‌ కాలేజీలు సేఫ్‌.. వంద శాతం వ్యాక్సినేషన్‌ కోసం స్పెషల్‌ డ్రైవ్‌..

ప్ర‌భ‌న్యూస్ : కరోనా మూడో వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే కళాశాలలకు వచ్చే విద్యార్థులెవరూ కరోనా బారినపడకుండా ఉండేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, 1609 ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. అయితే వీటిలో పనిచేస్తున్న 96 శాతం టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది అందరూ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ తెలిపారు. ఇందులో కరోనా వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌, డబుల్‌ డోస్‌ తీసుకున్న ఇరువురూ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా వ్యాక్సిన్‌ తీసుకోని సిబ్బందితో పాటు, ఇంటర్‌ కాలేజీల్లో చదువుతున్న 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులందరికీ సైతం కరోనా వ్యాక్సిన్‌ వేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఇందుకు ప్రతి కాలేజీల్లో స్పెషల్‌ సెంటర్లు పెట్టి సిబ్బందికి, విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్‌ వేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోని ప్రతి ఇంటర్‌ కాలేజీల్లో ఈ ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించనున్నారు. అంతేకాకుండా జిల్లా విద్యాధికారుల నుంచి ఆయా జిల్లాలోని కాలేజీలన్నీ వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నట్లు వారి నుంచి రిపోర్టులను తెప్పించుకునేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement