Friday, November 22, 2024

Inter Caste Marriage Scheme – కులాంత‌ర వివాహం – రూ. 2.5 ల‌క్ష‌లు అంద‌జేసిన ఎమ్మెల్యే కెవి వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో నివసించే గ్యార విజయ్ కుమార్ సంధ్య లు ఇటీవ‌ల కులాంతర వివాహం చేసుకున్నారు.. దీంతో డా. బి.ఆర్. అంబెడ్కర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పథకం, ఎస్.సి. సంక్షేమ శాఖ ద్వారా 2.5 లక్షలను ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ మంజూరు చేయించారు.

లబ్ధిదారులకు మంజూరైన రూ. 2.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే నేడు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కులాంతర వివాహం చేసుకున్నయువతీ యువకులు ఈ పథకాన్నిసద్వినియోగం చేసుకోవాలని , వారికీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.సి. సంక్షేమ శాఖ అధికారి కె.శ్రీకర్ రెడ్డి, వసతి గృహ సంక్షేమ అధికారులు నర్సింహా, కొండల్ రావు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement